గ్రేటర్ విశాఖలో జెండా ఎగరేద్దాం | ycp flag in the Greater Visakhapatnam | Sakshi
Sakshi News home page

గ్రేటర్ విశాఖలో జెండా ఎగరేద్దాం

Apr 24 2015 2:44 AM | Updated on Aug 21 2018 12:23 PM

గ్రేటర్ విశాఖలో జెండా ఎగరేద్దాం - Sakshi

గ్రేటర్ విశాఖలో జెండా ఎగరేద్దాం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు.

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ చంద్రబాబు సాగించిన ఏడాది నయవంచక పాలనపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోందని విమర్శించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలతో పార్టీ శ్రేణులు మమేకం కావాలని, ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం విశాఖలో గ్రేటర్ విశాఖ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విజయమే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఎన్నికల్లో పార్టీని గెలిపించి విజయమ్మకు కానుకగా ఇద్దామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement