కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తుని : కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైరాం రమేష్ ఒక పిచ్చి పుల్లయ్య అని అభివర్ణించారు. వార్డు మెంబర్గా కూడా గెలిచే సత్తా జైరాం రమేష్కు లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు ఆయన చెబుతున్న ప్యాకేజీ విలువ లేనిదని యనమల అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.