
సాక్షి, గుంటూరు: బీజేపీ సీనియర్ నాయకుడు టొబాకో బోర్డు చైర్మన్‌గా యడ్లపాటి రఘునాథబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రఘునాథ్ బాబుకు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తఫా, బీజేపీ నాయకులు కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఐటీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. టొబాకో బోర్డు చైర్మన్ పదవిలో రఘునాథబాబు మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.