నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్ | Y.S jagan mohan reddy arrives to idupulapaya | Sakshi
Sakshi News home page

నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్

Dec 24 2014 2:53 AM | Updated on Aug 17 2018 8:19 PM

నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్ - Sakshi

నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్లడించారు.

పులివెందుల :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం ఎర్రగుంట్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు.
 
 అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్‌ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
 

Advertisement
 
Advertisement
Advertisement