పథకాలన్నీ టీడీపీ వారికేనా?

Womens Slams Ke Krshnamurthy In Kurnool - Sakshi

కేఈ ప్రతాప్‌ను నిలదీసిన మహిళలు

డోన్‌ రూరల్‌: ‘‘ఏమన్నా.. మేమేం తప్పు చేశాం.. నాలుగేళ్లుగా అడుగుతున్నా ఇళ్లు మంజూరు కాలేదు..తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు..ప్రభుత్వ పథకాలన్నీ టీడీపీ వారికేనా? పేదలకు అందించారా’’ అంటూ టీడీపీ డోన్‌  నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ను మహిళలు నిలదీశారు. డోన్‌ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ ప్రతాప్‌.. గ్రామంలో ఇంటింటికి తిరుగుతుండగా మహిళలు నిలదీశారు. నాలుగేళ్లుగా ఇళ్లు మంజూ రు కాలేదని, మరుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రావడం లేదని, అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకు తప్ప ఎవరికీ అందడం లేదని ఆరోపించారు. గ్రామంలో తాగు నీటి సమస్య ఉన్నా  పట్టించుకోరా అంటూ నిలదీశారు. సమస్యలు తీరుస్తామని కేఈ ప్రతాప్‌ హామీ ఇవ్వడంతో శాంతించారు. 

అబద్ధాలు చెప్పకండి..సమస్యలు తీర్చండిఎమ్మెల్సీ కేఈని నిలదీసిన పల్లెదొడ్డి గ్రామస్తులు
దేవనకొండ: ‘‘ సమస్యలు పరిష్కరిస్తామని ప్రతి సమావేశం, సభల్లో  చెబుతున్నారు... ఇంతవరకు చేసిందేమీ లేదు.. అబద్ధాలు చెప్పకండి..సమస్యలు తీర్చండి’’ అంటూ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ను ప్రజలు నిలదీశారు. గురువారం మండల పరిధిలోని పల్లెదొడ్డి, గద్దెరాళ్ల, వెంకటాపురం, బుర్రకుంట గ్రామాల్లో గ్రామదర్శిని–గ్రామవికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా పల్లెదొడ్డి గ్రామంలో ప్రజల నుంచి నిరసనలు, నినాదాలు వెల్లువెత్తాయి. ఒక్కసారిగా గ్రామస్తులంతా ఏకమై ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. నాలుగేళ్లుగా తమ గ్రామానికి రేషన్‌షాపు కావాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామచంద్ర నాయుడు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top