వ్యభిచార గృహంపై దాడి, యువతుల అరెస్ట్ | womens arrested for prostitution after police raid | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి, యువతుల అరెస్ట్

Oct 29 2014 10:13 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరులోని రామిరెడ్డివారి తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్లో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన యువతులను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు : గుంటూరు నగరంలో వ్యభిచారం చాపకింద నీరులా మారింది. ఇటీవలే పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నగరంలోని రామిరెడ్డివారి తోటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు.  ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్లో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన యువతులను అదుపులోకి తీసుకున్నారు.

డీఎస్పీ గంగాధరమ్ కథనం ప్రకారం... పలు ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంట్లో పోలీసులు గత రాత్రి తనిఖీలు చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో యువతులెవరూ కనిపించకపోవటంతో అక్కడి పరిసరాల్ని పరిశీలించారు.   అయితే గదిలోని గ్యాస్ స్టౌవ్ బండ వద్ద  ఏర్పాటు చేసిన ఓ బండను తొలగించగా భూగర్భంలో రహస్యంగా నిర్మించిన గదిలో దాగిన నలుగురు యువతలు కనిపించారు.

వారిని విచారించగా అన్నపురెడ్డి సుమంత్ అనే వ్యక్తి...ఈ యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడి అయ్యింది.  గతంలోనూ సుమంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా,  రిమాండ్ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత అతడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సుమంత్ పరారీలో ఉండగా, యువతులను ఆధార్ హోమ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement