పిల్లలు మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యాయత్నం

Women Attempted to commit suicide in vizianagaram - Sakshi

పార్వతీపురం: తన కడుపున పుట్టిన పిల్లలు తాను చెప్పిన మాటలు వినడం లేదని మనస్థాపం చెందిన ఓ ఇల్లాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కొమరాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పార్వతీపురం ఏరియా ఆస్పత్రి అవుట్‌ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరాడ గ్రామానికి చెందిన దాసరి పైడితల్లి అనే వివాహిత తన భర్త పోలీసు, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పేలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వాంతులు అవడాన్ని గమనించిన పిల్లలు ఈ విషయాన్ని పక్కింటి వారికి చెప్పడంతో వారు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడి వైద్యులు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పైడితల్లి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top