పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు | woman maoist arrested in vishaka | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు

Apr 9 2016 9:30 AM | Updated on Oct 9 2018 2:47 PM

విశాఖ జిల్లా జీ.కే వీధి పోలీసులు శుక్రవారం రాత్రి ఓ మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు.

జీ.కే వీధి: విశాఖ జిల్లా జీ.కే వీధి పోలీసులు శుక్రవారం రాత్రి ఓ మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. గత పదేళ్లుగా గాలికొండ ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా పని చేస్తున్న వసంత అలియాస్ చెంచును పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వసంత మండలంలోని బొనంగిపల్లి గ్రామంలో చికిత్స పొందుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement