కాలేజీ ల్యాబ్లో మహిళా లెక్చరర్ ఆత్మహత్య | Woman Lecturer suicide in physics lab at addanki in prakasam district | Sakshi
Sakshi News home page

కాలేజీ ల్యాబ్లో మహిళా లెక్చరర్ ఆత్మహత్య

Nov 18 2014 12:50 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలోని పిజిక్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న అంజలిదేవి... ల్యాబ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా అద్దంకిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలోని పిజిక్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న అంజలిదేవి... ల్యాబ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం కళాశాల విద్యార్థులు, సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంజలిదేవి సోమవారం సాయంత్రమే ల్యాబ్లో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె అత్యహత్యకు గల కారణాల తెలియరాలేదు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను, కళాశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం అంజిలి దేవి మృతదేహన్ని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement