అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన 11 నెలల చంటిబిడ్డతో కాలువలోకి దూకింది.
కొత్తపేట (తూర్పుగోదావరి జిల్లా) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన 11 నెలల చంటిబిడ్డతో కాలువలోకి దూకింది. కొత్తపేట మండలానికి చెందిన నక్క వెంకటరమణ (20) అనే మహిళ శనివారం రాత్రి తన 11 నెలల బిడ్డతో సహా బొబ్బర్లంక-అమలాపురం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదివారం ఉదయం పలివెల వంతెన వద్ద వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తింటి వారి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వెంకట రమణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.