కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో శుక్రవారం చోటుచేసుకుంది.
విశాఖపట్నం : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో శుక్రవారం చోటుచేసుకుంది. భీమిలి మండలానికి చెందిన కంచుబోయిన మౌనిక(22) అనే మహిళకు, ఆనందపురం మండలం లోడగలవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల కిందట వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి వరుడు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మానసిక క్షోభను అనుభవిస్తున్న మౌనిక గత కొంత కాలంగా తల్లి వద్దే ఉంటుంది.
ఈ క్రమంలో జీవితం మీద నిరాశతో శుక్రవారం భీమిలి మండలంలోని జాతీయ రహదారిలోని బ్రిడ్జిపై నుంచి దూకింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఇటుక పని చేసుకుంటున్న ఒడిశాకు చెందిన కూలీలు గమనించి ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.