కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్ | will not say anything on new portfolio for now, says sailajanath | Sakshi
Sakshi News home page

కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్

Jan 1 2014 12:04 PM | Updated on Sep 2 2017 2:11 AM

కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్

కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్

కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు.

కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ...  2014లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు శాసన సభ వ్యవహారాల శాఖను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన డి.శ్రీధర్ బాబును సీఎం కిరణ్ ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను ఎస్. శైలజానాథ్కు అప్పగించారు.

 

శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టారు. అయితే ఆ బాధ్యతలను తాను స్వీకరించనని శ్రీధర్ బాబు ఇప్పటికే కరఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. మంత్రుల శాఖల మార్పుపై శైలజానాథ్ను బుధవారం విలేకర్లను ప్రశ్నించారు. ఈ సందర్బంగా శైలజానాథ్పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement