పాలల్లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం చేసిన భార్య | wife tries to kill her husband with poison | Sakshi
Sakshi News home page

పాలల్లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం చేసిన భార్య

Nov 28 2013 4:27 PM | Updated on Jul 27 2018 2:21 PM

వైవాహిక జీవితంలో మనుసులు భారంగా మారుతున్న ఘటనలు రోజూ ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

గుంటూరు: వైవాహిక జీవితంలో మనుసులు భారంగా మారుతున్న ఘటనలు రోజూ ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భర్తకు పాలల్లో విషమిచ్చి హత్య చేసేందుకు యత్నించిందో భార్య. జిల్లాలోని పెద్దపలకలూరులో భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చిన దారుణమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. భర్తను ఏదో రకంగా వదిలించుకోవాలని యత్నించిన భార్య చివరకు పాలల్లో విష ప్రయోగం చేసింది. గత కొన్ని రోజులుగా కుటుంబంలో చోటు చేసుకుంటున్న వివాదాలు కారణంగానే భార్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement