ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..? | When asked for the arrest of the public on the problems ..? | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..?

Published Thu, Jun 2 2016 12:21 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ప్రతిపక్షపార్టీల నాయకులను అరెస్టు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ

ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజం



పమిడిముక్కల : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ప్రతిపక్షపార్టీల నాయకులను అరెస్టు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. విజయవాడలో ధర్నా చేస్తున్న వంగవీటి రాధా, పైలా సోమినాయుడును పోలీసులు అరెస్టుచేసి పమిడిముక్కల స్టేషన్‌కు తరలిం చారు. ఈ సమాచారం తెలిసిన పార్టీ నాయకులు తరలివచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసప్రసాద్ ఉయ్యూరు నుంచి అనుచరులతో తరలివచ్చి రాధాకు మద్దతు తెలిపారు.


గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్టేష న్‌కు వెళ్లి రాధాను పరామర్శించారు. అనంతరం నాని మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో పేదలు 50 ఏళ్లుగా నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి కలెక్టర్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చేసినా నాయకులను అరెస్టుచేయడం అక్రమమన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పడు చంద్రబాబు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement