ఏపీతో కలసి పనిచేస్తాం | Western Australia deputy premier Roger Cook Meet with CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీతో కలసి పనిచేస్తాం

Sep 1 2017 1:31 AM | Updated on Aug 14 2018 11:26 AM

ఏపీతో కలసి పనిచేస్తాం - Sakshi

ఏపీతో కలసి పనిచేస్తాం

గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్‌ వెల్లడించారు.

పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్‌
సీఎం చంద్రబాబుతో భేటీ..  


సాక్షి, అమరావతి: గనులు, రవాణా, సాంకేతికత, వైద్య, విద్యా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్‌ వెల్లడించారు. తమ దేశానికి చెందిన పారిశ్రామిక పెట్టుబడిదారులను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సిస్టర్‌ స్టేట్‌ సంబంధాలు మరింత ధృడతరం కానున్నాయని చెప్పారు.

గురువారం రాత్రి ఆయన తన బృందంతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సిస్టర్‌ స్టేట్‌ సంబంధాలపై ఇరు ప్రభుత్వాల మధ్య రూ.3 వేల కోట్లతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడు తూ వ్యవసాయం, భూగర్భ గనులు, విద్య, రవాణా రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిం చనున్నామని చెప్పారు. ఈ నైపుణ్యాన్ని తిరుమల ఘాట్‌లో వినియోగించి ప్రమాదాలు నివారిస్తామన్నారు.

ఇకపై అభివృద్ధి, సంక్షేమానికేప్రాధాన్యం
అభివృద్ధిని చూసి నంద్యాల ప్రజలు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఇకపై రాజకీయాలకంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తానని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement