సాక్షి ప్రతినిధి, ఏలూరు: లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం మీద 52 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పార్లమెంట్‌కు సంబంధించి ఐదు నామినేషన్లు ఉండగా, 47 నామినేషన్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినవి. ఏలూరు, నర్సాపురం లోక్‌సభకు సంబంధించి 32 నామినేషన్లు దాఖలు కాగా ఐదు తిరస్కరణకు గురి కావడంతో ప్రస్తుతం 27 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకారం పొందాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 234 మంది నామినేషన్లు దాఖలుకాగా అందులో 47 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో 187 నామినేషన్లు అంగీకారం పొందాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందాయి. తిరస్కరణకు గురి అయిన నామినేషన్లలో ఎక్కువ శాతం డమ్మీ అభ్యర్థులవే ఉన్నాయి.
| పార్లమెంట్ స్థానం | మొత్తం నామినేషన్లు | ఆమోదం | తిరస్కరణ |
| నర్సాపురం | 20 | 17 | 3 |
| ఏలూరు | 12 | 10 | 2 |
| అసెంబ్లీ | మొత్తం నామినేషన్లు | ఆమోదం | తిరస్కరణ |
| ఏలూరు | 10 | 9 | 1 |
| నర్సాపురం | 17 | 15 | 2 |
| చింతలపూడి | 21 | 11 | 10 |
| తణుకు | 26 | 18 | 8 |
| తాడేపల్లిగూడెం | 20 | 15 | 5 |
| కొవ్వూరు | 17 | 14 | 3 |
| గోపాలపురం | 10 | 7 | 3 |
| నిడదవోలు | 14 | 11 | 3 |
| పాలకొల్లు | 40 | 31 | 9 |
| పోలవరం | 20 | 17 | 3 |
| భీమవరం | 17 | 15 | 2 |
| ఆచంట | 18 | 15 | 3 |
| ఉండి | 15 | 12 | 3 |
| తణుకు | 18 | 16 | 2 |
| ఉంగుటూరు | 10 | 8 | 2 |


