ఏపీ ఎన్జీవోల సభను అడ్డుకుని తీరుతాం | We Will obstruct AP NGOs Meeting in Hyderabad, says OU JAC | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవోల సభను అడ్డుకుని తీరుతాం

Sep 5 2013 2:51 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఈనెల 7వ తేదీన జరగనున్న ఏపీఏన్జీవోల సభను అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసీ స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో జేఏసీ నేతలు గురువారం సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : ఈనెల 7వ తేదీన జరగనున్న ఏపీఏన్జీవోల సభను అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసీ స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో జేఏసీ నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శనివారం రంగారెడ్డి, హైదరాబాద్ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అదే రోజు జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు  7న సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ నెల 7న ఎల్బీ స్టేడియలో జరిగే.. ఎపీ ఎన్జీవోస్‌ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో సహా తరలివెళ్తామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు.  సభను సీమాంధ్ర ఉద్యోగులకు మరింత అవగాహన కలిగించడానికి ఉద్దేశించి జరుతున్నట్లు వారు తెలిపారు. గురువారం కూడా సచివాలయంలో ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఏ ప్రాంతంవారికి వ్యతిరేకంగా ఈ బహిరంగ సభను నిర్వహించడంలేదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement