'ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం' | we will create ideal State of telangana, saya komatireddy venkata reddy | Sakshi
Sakshi News home page

'ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం'

Feb 21 2014 2:50 PM | Updated on Oct 22 2018 9:16 PM

'ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం' - Sakshi

'ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం'

తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ర్యాలీగా గన్పార్క్ వద్దకు వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. విలీనమా, పొత్తా అనేది కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభించారని కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శించటం సరికాదని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement