'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం' | We deference with bhuma family, says independent candidates in allagadda by election | Sakshi
Sakshi News home page

'అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకున్నాం'

Oct 24 2014 1:00 PM | Updated on Apr 4 2019 3:02 PM

తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు.

కర్నూలు: తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్వతంత్ర అభ్యర్థులు సింగం వెంకటేశ్వరరెడ్డి, బాలగంగాధర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అంటే ఈ రోజుతో ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు  ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిరువురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. 

భూమా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి నిలపలేదు. అదికాక స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా తమ నామినేషన్ ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అభ్యర్థి, భూమా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement