విద్యార్థులపై కర్కశత్వం | watch men punished hardley | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై కర్కశత్వం

Jan 4 2014 2:29 AM | Updated on Mar 22 2019 7:19 PM

అల్లరి చేస్తున్నారన్న నెపంతో వసతి గృహంలో నలుగురు విద్యార్థులను ప్లాస్టిక్ పైపుతో చితకబాదిన సంఘటన శుక్రవా రం జరిగింది.


 గంగవరం, న్యూస్‌లైన్ : అల్లరి చేస్తున్నారన్న నె పంతో వసతి గృహంలో నలుగురు విద్యార్థులను ప్లాస్టిక్ పైపుతో చితకబాదిన సంఘటన శుక్రవా రం జరిగింది. స్థానిక గి రిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి విద్యార్థులు తెలి పిన వివరాలిలా ఉన్నా యి. వసతి గృహంలో శుక్రవారం ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయంలో మూడో తరగతి విద్యార్థి చెల్లూరి నానిబాబు, ఏడో తరగతి విద్యార్థి పుడియం రామన్న గొడవ పడ్డారు. రామన్న తనను కొట్టాడంటూ అక్కడున్న విద్యా వలంటీర్ ప్రసాద్‌కు నానిబాబు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో కొంతమంది విద్యార్థులు అల్లరి చేస్తుడడంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్, వాచ్‌మన్ రెడ్డి చేతికి దొరికిన పైపు ముక్కలతో వారిని చితకబాదారు.
 
 నానిబాబుకు వీపుపై తట్లు ఏర్పడగా, రామన్న, కశింకోట అరుణకుమార్, మడకం రమేష్‌కు గాయాలయ్యాయి. ఎంఈఓ మల్లేశ్వరరావు విద్యార్థులను పరామర్శించారు. ఇలాఉండగా ఈ సంఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుం టామని ఐటీడీఏ  పీఓ నాగరాణి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement