గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రచ్చబండ-2లో తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తాత్కాలిక రేషన్‌కార్డులు మంజూరు చేసింది.
	ముద్దనూరు, న్యూస్‌లైన్: గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రచ్చబండ-2లో తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తాత్కాలిక రేషన్‌కార్డులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 31,675 మంది లబ్ధిదారులకు అప్పట్లో ప్రభుత్వం కూపన్లను, తాత్కాలిక రేషన్‌కార్డులను పంపిణీ చేసింది. కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు 6నెలలు గడుస్తున్నా పంపిణీ చేయలేదు.
	 
	 చౌకదుకాణాల ద్వారా  నిత్యావసర వస్తువులను పొందడానికి ఆరు నెలలకు సరిపడా రేషన్‌కూపన్లను అందించింది. జూన్ నెలకు మాత్రమే లబ్ధిదారులకు కూపన్లు అందుబాటులో వున్నాయి. వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు పొందడానికి అవసరమయ్యే కూపన్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మారడంతో కూపన్లు పొందిన వారికి కొత్త రేషన్‌కార్డులందించే విషయంలో ఇంకా అధికారులు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
