'రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం' | vishnu kumar raju support chevireddy bhaskar reddy protest | Sakshi
Sakshi News home page

'రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం'

Mar 27 2017 11:08 AM | Updated on Aug 18 2018 5:15 PM

'రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం' - Sakshi

'రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం'

రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడిని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు.

అమరావతి: రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుల దాడిని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. ఈ కేసులో ఎవరున్నా శిక్షించాల్సిందేనని అన్నారు. ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. అధికార పక్షానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా అని ప్రశ్నించారు. అధికారులతో ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడతామని విష్ణుకుమార్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement