
సాక్షి, విజయవాడ: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ అనంతరం దాయాది దేశం పాకిస్తాన్.. అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశంలో 20 కోట్ల ముస్లింలు ఉగ్రవాదులే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై బెజవాడ ముస్లింలు మండి పడుతున్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని చేతబూని.. హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ నిరనస వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్‌పై యుద్ధం వస్తే సైన్యంతో పని లేకుండానే పాక్‌ని మట్టబెడతామంటూ ముస్లిం సోదరులు హెచ్చరించారు.