
సాక్షి, అమరావతి : నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు ఉన్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు ఉన్నాయి. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారన్న వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020
కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్లున్నాయని పేర్కొన్నారు. నెల తర్వాత నోరు విప్పి లేఖ రాసింది తానే అంటున్నారని, దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటికి బోధపడినట్లుందని ఎద్దేవా చేశారు. (‘బాబు బుర్ర ఎల్లో వైరస్‌తో నిండిపోయింది’)
కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్లున్నాయి. నెల తర్వాత నోరు విప్పి లేఖ రాసింది తానే అంటున్నారు. దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటికి బోధపడినట్లుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2020