శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి రాజధానికి తిరుగుముఖం పట్టిన వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు...
విశాఖపట్నం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి రాజధానికి తిరుగుముఖం పట్టిన వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విశాఖ విమానాశ్రయంలో గురువారం హృదయపూర్వక వీడ్కోలు లభించింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆమెను పెద్దసంఖ్యలో అభిమానులు, నాయకులు కలుసుకున్నారు.
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ, పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఉత్తరనియోజకవర్గం సమన్వయకర్త జీవీ రవిరాజు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలాగురువులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కోరాడరాజబాబు, డాక్టర్‌జహీర్‌అహ్మద్, మాజీ కార్పొరేటర్‌లు చొప్పానాగరాజు, అంగఅప్పలరాజు, శీరం జ్ఞానప్రకాష్, పార్టీ రూరల్ జిల్లా ప్రచారకార్యదర్శి పోతల ప్రసాద్, పార్టీ నాయకురాలు ప్రభాగౌడ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, సేవాదళ్ కన్వీనర్ భూపతిరాజు శ్రీనివాసరాజు, నగర యువజనవిభాగం కన్వీనర్ గుడ్ల పోలిరెడ్డి, పార్టీనాయకుడు గండి రవికుమార్, రాష్ట్ర బీసీ కమిటీ సభ్యుడు తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్ తదితరులు విజయమ్మకు వీడ్కోలు పలికారు.