వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు | vasavi matha padalu 1.55 tonnes in penugonda | Sakshi
Sakshi News home page

వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు

Aug 27 2016 3:38 AM | Updated on Sep 4 2017 11:01 AM

వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు

వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు

వాసవీ అమ్మవారి పాదాలను 1.55 టన్నుల పంచ లోహాలతో తయారు చేశారు.

పెనుగొండ: పంచ లోహాలతో తయారు చేసిన వాసవీ అమ్మవారి పాదాలివి. దీనికి 1.55 టన్నుల పంచ లోహాలను వినియోగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతి ధామ్‌లో నెలకొల్పనున్న 90 అడుగుల వాసవీ మాత పంచ లోహ విగ్రహానికి వీటిని అమర్చనున్నారు.

రూ.20 కోట్ల వ్యయంతో 45 టన్నుల పంచ లోహాలతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అమ్మవారి నిజ పాదుకలుగా పేర్కొంటున్న వీటిని 2014 ఆగస్టు 17న బెంగళూరు మల్లేశ్వరం క్రీడా మైదానంలో వాసవీ పీఠాధిపతులు, స్వామీజీలు ఆవిష్కరించారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా దేశం నలుమూలలా సుమారు 21,500 కిలోమీటర్ల మేర వీటిని రథంలో ఊరేగించి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శింపచేశారు. శనివారం వీటిని పెనుగొండలోని వాసవీ శాంతిధామ్‌లో ప్రతిష్ఠించనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement