దోచుకునేందుకే ధర్మవరానికి ‘పరిటాల’ 

Varadapuram Suri Criticizes The Family Of Paritala - Sakshi

పరిటాల కుటుంబంపై వరదాపురం సూరి మండిపాటు 

సాక్షి, ధర్మవరం రూరల్‌: దోచుకోవడానికే పరిటాల కుటుంబం ధర్మవరం రావడానికి ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యానారాయణ(వరదాపురం సూరి) మండిపడ్డారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ రాప్తాడు నియోజకవర్గాన్ని పరిటాల సునీత అభివృద్ధి చేయకుండా మండలాలకు ఇన్‌చార్జ్‌లను పెట్టి  దోచుకున్నారని ఆరోపించారు. అక్కడ దోచుకుతిన్నది చాలదన్నట్లు ధర్మవరంలో కూడా దోచుకోవడానికి వస్తామని పరిటాల సునీత చెపుతున్నారన్నారు.

ఇన్నాళ్లు  గ్రూపు రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుకున్నారే కాని ఆ పార్టీ అభివృద్ధికి ఏ¯ కృషి చేయలేదని విమర్శించారు. ధర్మవరం చెరువుకు నీళ్లు తెస్తుంటే పరిటాల సునీత అడ్డుకున్నారని గుర్తు చేశారు. తాను టీడీపీలో ఉన్నన్నాళ్లు సొంత డబ్బుతో పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని తమ పబ్బం గడుపుకోలేదని పరోక్షంగా పరిటాల సునీతను ఎద్దేవా చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరం వచ్చినప్పుడు ఒక నేత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, 2009 ఎన్నికల్లో ఆమెకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి పనిచేశారా? లేక కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు పనిచేశారా? అనే విషయాన్ని చెప్పాలన్నారు. 2019లో కూడా ఆమె ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీకి పనిచేశారో చెప్పాలన్నారు.

తాను బీజేపీలోనే ఉంటానని ఏ పార్టీలోకి  వెళ్లనని, 15 ఏళ్లుగా తనతో ఉన్న నాయకులు, కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. చాలా చోట్ల పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.నాయకులు శ్యామ్‌రావు, సుదర్శన్‌రెడ్డి, సాకే ఓబిళేసు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top