టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కల్యాణదుర్గంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు.
అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కల్యాణదుర్గంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని ఉద్యోగులు పయ్యావులతో వాగ్వాదానికి దిగారు. పయ్యావుల గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. దాంతో కల్యాణదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడని సీమాంధ్రవాసులు భావిస్తున్నారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాంతో అందరూ టిడిపిపైన, చంద్రబాబుపైన ఆగ్రహంతో ఉన్నారు.