సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకగా నిర్వహించారు. నిత్యం ప్రజల కోసం తపించే ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును శనివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకగా నిర్వహించారు. నిత్యం ప్రజల కోసం తపించే ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి.. అనాథాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు. యాచకులకు దుప్పట్లు.. నిరుపేద వితంతువులకు చీరలు అందజేయడంతో పాటు పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయాల్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పద్మావతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ డిగ్రీ కళాశాలలో ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటైంది.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి తదితరులు పత్తికొండ కస్తూరిబా పాఠశాలలో జననేత వేడుకలను జరుపుకున్నారు. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాదరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు.
డోన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. రైల్వే స్టేషన్, కలెక్టరేట్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లోని యాచకులకు దుప్పట్లు అందించారు. మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం బుధవారపేటలో పేద వితంతువులకు చీరలను పంచారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి విభాగంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.