ఇక్కడ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలనలు: కులస్తే

సాక్షి, కృష్ణా: దేశ వ్యాప్తంగా దాదాపు 1259 ఎకరాలు ఈ లైమ్ స్టోన్ గనులు విస్తరించి ఉన్నాయని, ఇందులో అత్యంత నాణ్యమైన లైమ్ స్టోన్ విశాఖలోనే ఉందని కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులను గురువారం ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా అంబేద్కర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక లైమ్ స్టోన్ గనులను, యత్ర సామాగ్రిని పరిశీలించి.. మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 146 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ వెలికి తీస్తున్నామని తెలిపారు. ఇక్కడ 900 ఎకరాల అటవీ భూమి ఉందని, ప్రస్తుతం 345 ఎకరాల మైనింగ్ జరుగుతుందని చెప్పారు. సంవత్సరానికి 997 టన్నుల లైమ్ స్టోన్‌ను ఈ గనుల నుంచి వెలికితీస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్‌ను తవ్వీ తీసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. రైల్యే, సముద్ర మర్గాలలో లైమ్ స్టోన్ ఇతర దేశాలకు ఎగుమతులు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇక ఈ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలనలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి