పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో ఓ వృద్ధురాలు మంగళవారం దారుణహత్యకు గురైంది.
వృద్ధురాలి దారుణ హత్య..
Jun 13 2017 5:15 PM | Updated on Jul 29 2019 5:43 PM
విశాఖపట్నం: పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో రామలక్ష్మి(68) అనే వృద్ధురాలు మంగళవారం దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దిండును ముఖానికి అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
ఓ కుమారుడు విజయవాడలో ఉంటుండగా..మరో కుమారుడు గ్రూప్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కుమార్తె ప్రహ్లాదపురంలోనే నాలుగు ఇళ్ల అవతల ఉంటోంది. ఈ ఘటనపై క్రైం డీసీపీ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలంలోకి డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement