కామవరం వాగు ప్రమాదం; ఆరుకు పెరిగిన మృతులు | Two missing in Konda vagu | Sakshi
Sakshi News home page

కామవరం వాగు ప్రమాదం; ఆరుకు పెరిగిన మృతులు

Aug 16 2015 4:43 PM | Updated on Aug 25 2018 6:06 PM

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలోని కామవరం వాగులో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందారు.

బుట్టాయగూడెం : పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలోని కామవరం వాగులో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఆదివారం ఉదయం కామవరం వాగు అవతల ఉన్న గుబ్బాల మంగమ్మ గుడిలో పూజలు చేసి వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీళ్లు ఉధృతంగా వచ్చాయి.

దాంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి(32), వేముల మాధవి(23), నక్కల గొల్లగూడెంకు చెందిన ఆకుల కల్యాణి(38), మరీదు సరస్వతి(60), సాయి(15), వేముల లోకేష్(13) లుగా గుర్తించారు. అయితే  గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement