పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. తణుకు మండలం కేతలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రెండు బైక్‌లపై ద్వారకాతిరుమల క్షేత్రానికి బయలు దేరారు. మార్గమధ్యలో పెద్ద తాడేపల్లి వద్ద ఒక బైక్ టైరు పంక్చర్ అయింది. దీంతో పురుషులిద్దరూ బైక్‌లను రోడ్డు పక్కన నిలిపి, మరమ్మతు చేస్తుండగా మహిళలు ఇద్దరు డివైడర్‌పై కూర్చున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ వేగంగా డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ఇద్దరు ధనలక్ష్మి(45), గీతాభవాని(35) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన ఇద్దరూ అత్తాకోడళ్లు.