ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి | Two killed in road accident at Vizaiangaram district | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి

Dec 8 2014 6:59 AM | Updated on Aug 25 2018 6:06 PM

జిల్లాలోని ఎత్తురోడ్డు సమీపంలో ఇందిరానగర్ వద్ద సోమవారం ఉదయం ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది.

విజయనగరం: జిల్లాలోని ఇందిరానగర్ వద్ద ఎత్తురోడ్డు సమీపంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ పోర్టు నుంచి రాయ్గఢ్ వెళ్తున్న కెమికల్ లోడ్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

మృతులు విజయనగరం, కాకినాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ సహా క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement