విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి | Two killed in electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Jan 7 2016 5:14 PM | Updated on Sep 5 2018 2:26 PM

పెద్దపాడు మండలం పూనుకొల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మృతిచెందారు.

పెద్దపాడు మండలం పూనుకొల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మృతిచెందారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రేమల్లి గ్రామంలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో బడుగు సాయి దుర్గా ప్రసాద్(20), కొనకళ్ల రామకృష్ణ (24) మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement