నక్సల్స్ మంటూ పలువురికి మస్కా కొట్టి డబ్బులు గుంజిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
తుని(రాజమండ్రి) : నక్సల్స్ మంటూ పలువురికి మస్కా కొట్టి డబ్బులు గుంజిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిని ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు నకిలీ నక్సల్స్‌ను అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన దరావత్ సైదులు, రాజమండ్రి నివాసి అయిన మట్టా సురేశ్‌లు కలసి పలువురిని గతంలో కూడా ఇలాగే మోసగించినట్లు విచారణలో తేలింది.