ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా | Two boys drown in quarry pits | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా

Jan 11 2016 5:47 PM | Updated on Aug 25 2018 6:52 PM

ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని బూదవాడలో గ్రానైట్ క్వారీ గుంతల్లో ఈత కోసం దిగిన ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు.

బెస్తవారిపేట : ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని బూదవాడలో గ్రానైట్ క్వారీ గుంతల్లో ఈత కోసం దిగిన ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామానికి చెందిన కిన్నెర పవన్‌కుమార్ (14), సూర్యబోయిన వెంకట శివరామకృష్ణ (12) సంక్రాంతి సెలవుల నేపథ్యంలో బూదవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం సమీపంలోనే వినియోగంలో లేని గ్రానైట్ క్వారీల గుంతల్లో నీరు నిలిచి ఉన్న వాటిలోకి ఈత కోసం దిగి..ఆ నీటిలో మునిగి మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement