breaking news
Quarry pits
-
ఇద్దరిని మింగిన క్వారీ గుంత
కలికిరి: సాయంకాలం అలా ఆహ్లాదంగా గడుపుదామని గ్రామం సమీపంలోని క్వారీ గుంత వద్దకు వెళ్లిన ఓ యువతి, బాలిక నీట మునిగిపోయారు. ఈ çఘటన గురువారం సాయంత్రం కలికిరి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పల్లవోలు గ్రామం గడి–గ్యారంపల్లి మార్గంలో పాకాలకు చెందిన టీడీపీ నాయకుడు, కాంట్రాక్టరు విశ్వనాథనాయుడుకు చెందిన మూతబడిన క్వారీ ఉంది. క్వారీ లోపల గుంతల్లో గతంలో కురిసిన వర్షాలకు నీరు చేరింది. అడుగున బండరాయి ఉండడంతో నీరు ఆహ్లాదంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామస్తులు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి ఈతకొట్టివాతావరణాన్ని ఆస్వాదించేవారు. ఈ క్రమంలోనే గడికి చెందిన షేక్ ఇస్మాయిల్, రేష్మల ఇంటికి చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన నజీర్ సాబ్ భార్య ముంతాజ్, కుమార్తె చష్మా(20), పుంగనూరు కొత్త ఇండ్లుకు చెందిన యువకుడు షాహీద్(18) వచ్చారు. గురువారం షేక్ ఇస్మాయిల్ బంధువైన గడి గ్రామానికే చెందిన సయ్యద్ బాషా ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి స్లాబ్ పనులు చేపట్టారు. సాయం కాలం స్లాబ్ పని పూర్తయిన తరువాత ఇస్మాయిల్ కుమార్తెలు షబ్రీన్, అఫ్రీన్, వారి ఇంటికి వచ్చిన చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన ముంతాజ్, ఆమె కుమార్తె చష్మా, రోహీద్ కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు కలిసి నీటిలో దిగారు. నీటి లోతు తెలియక పోవడం, వారిలో ఎవరికీ ఈత రాకపోవడంతో కొంత లోతుకెళ్లి ఉక్కిరిబిక్కిరయ్యారు. గమనించిన షాహీద్ ముంతాజ్‌ను ఒడ్డుకు లాగాడు. షబ్రీన్ అప్పటికే గట్టుకు చేరుకుంది. చష్మా(20), అఫ్రీన్(14) నీటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న వారు కేకలు వేశారు. సమాచారం గడివాసులకు తెలియచేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని వెతికినా బాలికల ఆచూకీ లభించలేదు. సుమారు గుంత 40 నుంచి 50 అడుగుల లోతు ఉండడంతో స్థానికులు వారిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శుక్రవారం బాలికలను వెలికితీతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
క్వారీ గుంత ముగ్గురిని కబళించింది..
హైదరాబాద్: నూతన గృహప్రవేశ ఆనందంలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారు. అంతలోనే ఆ ఇంట విషాదం అలుముకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురిని క్వారీగుంత కబళించింది. మృత్యువాత పడినవారిలో తల్లి, కుమారుడు ఉన్నారు. కొడుకును, భార్యను కోల్పోయిన వ్యక్తి రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. వివరాలు.. కర్ణాటక గురిమెట్టుకాల్ క్యాశవరం గ్రామానికి చెందిన కె.నర్సింహ, సావిత్రమ్మ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో ఉంటూ చీపుర్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహ ఇటీవల గాజులరామారం సర్కిల్ బాలయ్యనగర్‌లో ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశ కార్యానికి మహబూబ్‌నగర్, కర్ణాటకల నుండి బంధువులు వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూజలు ముగిశాయి. ఉదయం 10.30 గంటలకు నర్సింహ తల్లి అయ్యమ్మ(65), సావిత్రమ్మ అక్క అనిత (30), ఆమె కుమారుడు యశ్వంత్(10) బట్టలు ఉతికేందుకు సమీపంలోని క్వారీ గుంత వద్దకు వెళ్లారు. యశ్వంత్ నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో జారిపడ్డాడు. బాలుడిని కాపాడబోయిన సావిత్రమ్మ, అయ్యమ్మలు కూడా నీటిలో మునిగిపోయారు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బంధువులు క్వారీ గుంతలో దిగి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే వారు విగతజీవులయ్యారు. కుమారుడు యశ్వంత్, భార్య అనితను కోల్పోయిన ఎల్లప్ప అనే వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు. జగద్గిరిగుట్ట పోలీసు లు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా
బెస్తవారిపేట : ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని బూదవాడలో గ్రానైట్ క్వారీ గుంతల్లో ఈత కోసం దిగిన ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామానికి చెందిన కిన్నెర పవన్‌కుమార్ (14), సూర్యబోయిన వెంకట శివరామకృష్ణ (12) సంక్రాంతి సెలవుల నేపథ్యంలో బూదవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం సమీపంలోనే వినియోగంలో లేని గ్రానైట్ క్వారీల గుంతల్లో నీరు నిలిచి ఉన్న వాటిలోకి ఈత కోసం దిగి..ఆ నీటిలో మునిగి మృతి చెందారు. -
విషాదం..
తుళ్లూరు/ విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పంచాయతీ పరిధిలోగల కేంద్రీయ విద్యాలయంలో పెనుమూడి రాజేష్(17), బోరుగడ్డ సాగర్(17) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో వీరిద్దరూ మరో 15 మంది విద్యార్థులతో కలిసి ఆటోల్లో చౌడవరంలో తమ స్నేహితుడు షాలిన్ తండ్రి మార్క్ నిర్వహిస్తున్న చర్చిలో ప్రార్థనలకు వెళ్లారు. ఒంటి గంట సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో గ్రామ సమీపంలోని కొండను ఎక్కి కొంత సేపు ప్రకృతి అందాలను తిలకించారు. 3 గంటల ప్రాంతంలో దాసరిపాలెం వద్ద ఆటోలు నిలిపారు. అక్కడి క్వారీ గుంతల్లోని నీటిలో ఈతకు దిగాలనుకున్నారు. కొందరు వద్దని వారిస్తున్నా ఏడుగురు విద్యార్థులు ఈతకు దిగారు. వీరిలో లోతుకు వెళ్లిన రాజేష్, సాగర్ నీటిలో మునిపోతుండగా ఒడ్డున ఉన్న విద్యార్థులు కేకలు వేశారు. వచ్చి రక్షించేలోగానే ఇద్దరూ నీట మునిగిన వారిని వెలికితీసి గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమతోపాటుగా ఆడుతూ పాడుతూ అప్పటి వరకూ ఉన్న స్నేహితులు మరణించటంతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో కష్ట పడి చదువుకునే విద్యార్థుల మృతివార్త విని పాఠశాల ప్రిన్సిపల్ ఎం.రాజేశ్వరరావు కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాద విషయం విషయం తెలుసుకున్న రూరల్ డీఎస్పీ నరసింహ, సీఐ వై.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి క్వారీ గుంతలు తవ్విన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. సంప్రదాయాలు మరిచిపోకూడదనే గుంటూరుకు.. రాజేష్ తల్లిదండ్రులు రమణ, బాలబూసీలకు ఒక్కగానొక్క కొడుకు. స్వస్థలం సత్తెనపల్లి మండలం యన్నాదేవి. బాలబూసి సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పని చేస్తున్నారు. విధుల నిమిత్తం 15 ఏళ్ళుగా డిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో పనిచేశారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న బాలబూసీ తాను విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేశానని, రాజేష్ చిన్న నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో పెరగటం వల్ల తెలుగు భాషను, సంప్రదాయాలు తెలియకుండా పోతాయనే ఉద్ధేశంతో నాలుగు నెలల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారం 4వలైనుకు వచ్చామని తెలిపారు. సాగర్‌ది జిల్లాలోని మేడికొండూరు. తండ్రి రాజారత్నం డ్రైవర్. కూలీ పనులు చేసుకుంటూ తాము తినకున్నా కొడుకును చదివిస్తున్నారు. అతన్ని ఉన్నత స్థితిలో ఉంటే చూడాలని కలలు కన్న కొడుకు అర్ధంతరంగా లోకం వీడటంతో తండ్రి రాజారత్నం కన్నీరుమున్నీరు కావడం చూపరులను కదిలించింది. విహారం కోసం వచ్చి... అమరేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన యువ ఇంజినీర్ల బృందంలో నదిలో స్నానానికి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోగల నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో విద్యుత్ ఏఈలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో వున్న వివిధ థర్మల్ పవర్ ప్లాంట్లకు చెందిన ఏఈలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారంతో శిక్షణా తరగతులు ముగిశాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఏఈలు అమరావతి చూడాలని భావించారు. తొమ్మిదిమంది యువ ఇంజినీర్లు, ముగ్గురు మహిళా ఇంజినీర్లు కలసి మొత్తం 12 మంది కృష్ణా జిల్లా ఫెర్రి పడవల రేవు నుంచి ఓ మరపడవలో కృష్ణానది మీదుగా అమరావతికి వచ్చారు. అమరేశ్వరుని దర్శించుకుని పడవలోనే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో సాయంత్రం సుమారు 5గంటల సమయంలో మండల పరిధిలోని వైకుంఠపురం ఇసుక తిన్నెల వద్ద సందీప్శ్యామ్సన్(26), పాండురంగారావు(25) అనే ఇద్దరు ఇంజినీర్లు స్నానానికి దిగారు. ఈ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వారిద్దరూ నీటమునిగి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. పొలాల నుంచి వెళుతున్న స్థానికులు విషయం తెలుసుకుని వెంటనే అమరావతి సీఐకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అమరావతి, తుళ్ళూరు పోలీసులు, ఫైర్ సిబ్బంది గల్లంతయిన వారిని గాలించేందుకు హరిశ్చంద్రపురంలోని పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు చూపిన సంఘటనా స్థలంలో గజ ఈతగాళ్ళతో గాలింపు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.కన్నీరు మున్నీరైన సహచర ఉద్యోగులు..రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏఈగా పనిచేస్తున్న సందీప్ శ్యాంసన్, ఎన్టీటీపీఎస్లో ఏఈ అయిన పాండురంగారావు ఇద్దరికీ ఇంకా కూడా వివాహం కాలేదని తోటి ఉద్యోగులు తెలిపారు. కళ్లముందే నీట మునుగుతున్నా కాపాడలేకపోయామని, ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.