
టిటిడి లడ్డు నాణ్యత పెంపు
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత పెంచాలని ఈ రోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నాణ్యత పెంచాలని ఈ రోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 4 లక్షల 50వేల క్వింటాళ్ల ఆవు నెయ్యి, 4 లక్షల 50 వేల కిలోల రవ్వ కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
శ్రీ గంధం మొక్కల పెంపకానికి 5 కోట్ల రూపాయల కేటాయించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీటీడీ స్థలంలో 25 కోట్ల రూపాయలతో గణపతి, వెంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు ఎస్వీబీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి అన్ని టీటీడీ సత్రాలలో ఉచిత అన్నదాన ప్రసాదాన్ని ప్రారంభిస్తారు.