టీటీడీ ఆస్తుల వేలంపై నిర్ణయం తీసుకోలేదు

TTD Chairman YV Subba Reddy Speech On TTD Assets - Sakshi

గత బోర్డు తీసుకున్న నిర్ణయాలపై మాత్రమే చర్చించాం

1974 నుంచి టీటీడీ భూములు అమ్ముతున్నారు

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు : వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరర్థక ఆస్తుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డ్ (టీడీపీ హయాంలో)  తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. ఆస్తుల అమ్మకం గురించి బోర్డు తరఫున ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదని, నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డు నిర్ణయం మేరకు ఆస్తులను అమ్మాల్సి వస్తే పీఠాధిపతిలు, స్వామీజీల సలహాలు సూచనలు తీసుకొనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టీటీడీని అడ్డుకుపెట్టుకుని కుట్రపూరితంగా తమపై వ్యతిరేకతతో కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆస్తుల అమ్మకం కొత్తమే కాదు..
టీటీడీ  ఆస్తుల విక్రయాల అంశంపై సోమవారం తాడేపల్లిలో వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీకి సంబంధించిన తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు. ‘టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై సమీక్ష మాత్రమే జరిపాము. అమ్మాలి అనుకుంటే ఎక్కోడా మారుమూలన ఉండే ఆస్తులు అమ్ముతామా..? మేము దేవుడు సేవలో ఉన్నాము. దేవుడు సొమ్ము ఆశించించే ప్రసక్తే లేదు. గతంలో నేను క్రిస్టియన్ అని అసత్య ప్రచారం చేశారు. దేవుడు భూముల కాజేయలని చూసింది చంద్రబాబు నాయుడే. సదవర్తి, దుర్గమ్మ భూములు కాజేయాలని చూసింది చంద్రబాబు. దేవుడుకి వచ్చిన ప్రతి పైసా మేము కాపాడుతున్నాము. నిరుపయోగంగా ఉన్న టీటీడీ భూములు అమ్మడం కొత్తేమి కాదు. టీటీడీలో 1974 నుంచి భూములు అమ్ముతున్నారు. చంద్రబాబు హయాంలో కూడా భూములు అమ్మకానికి పెట్టారు.

టీడీపీ హయాంలోనే నిర్ణయం..
టీడీపీ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ చైర్మన్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న నిరర్ధక టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల అమ్మిన వాటిని టీటీడీ కార్పస్ ఫండ్లో వేయాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు కూడా వాస్తలు తెలుసుకోవాలి. టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో బీజేపీ సభ్యలు కూడా ఉన్నారు. ఆస్తుల అమ్మకం గురించి మాట్లాడుతున్న భాను ప్రకాష్ రెడ్డి ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో సభ్యుడే. టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై ఎల్లో మీడియా నోరు ఎందుకు మెదపలేదు. ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వివరణ ఇచ్చిన పదే పదే తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది సరైనది కాదు’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top