2014-15 వార్షిక బడ్జెట్ రూ. 2,401 కోట్లు: టీటీడీ | TTD approves Rs 2,248 Crore budget | Sakshi
Sakshi News home page

2014-15 వార్షిక బడ్జెట్ రూ. 2,401 కోట్లు: టీటీడీ

Feb 22 2014 5:20 PM | Updated on Aug 28 2018 5:43 PM

2014-15 వార్షిక బడ్జెట్ రూ. 2,401 కోట్లు: టీటీడీ - Sakshi

2014-15 వార్షిక బడ్జెట్ రూ. 2,401 కోట్లు: టీటీడీ

కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ పాలకమండలి 2014- 15 వార్షిక బడ్జెట్కు సంబంధించి నిర్ణయాలను ప్రకటించింది.

తిరుమల: కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం 2014- 15 వార్షిక బడ్జెట్కు సంబంధించి నిర్ణయాలపై లో టీటీడీ పాలకమండలి శనివారం ఆమోదం తెలిపింది. ఈ 2014-15 వార్షిక బడ్జెట్ ప్రకారం 2, 401 కోట్లు రూపాయలుగా టీటీడీ పేర్కొంది. ఈ బడ్జెట్లో భాగంగా 1,793 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, 1,040 మందికి ఉద్యోగులకు అపార్ట్‌మెంట్స్‌లో ప్లాట్లు ఇవ్వాలని నిర్థయించినట్టు తెలిపింది.

ఉద్యోగులకు వైట్ కార్డ్‌ ప్రాతిపదికన ఉచిత వైద్యం అందించనున్నట్టు టీటీడీ తెలిపింది. పద్మావతి అమ్మవారి ఉరేగింపు వాహనాలకు.. రూ.8.5 కోట్లతో బంగారపు తాపడం చేయించాలని టీటీడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో...శ్రీవారి హుండీ ద్వారా 900కోట్ల రూపాయల ఆదాయం రానున్నట్టు టీటీడీ అంచనా వేస్తోంది. తలనీలాల ద్వారా రూ. 220 కోట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 130కోట్ల ఆదాయం రానున్నట్టు టీటీడీ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement