డీజీపీ దినేష్‌రెడ్డిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు బెదిరింపులు వస్తున్నాయని, ఆయనకు భద్రత పెంచాలని డీజీపీని వారు కోరారు.
డీజీపీ దినేష్‌రెడ్డిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు బెదిరింపులు వస్తున్నాయని, ఆయనకు భద్రత పెంచాలని డీజీపీని వారు కోరారు. కేసీఆర్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి దినేష్రెడ్డి తెలిపారు.
అంతకుముందు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను టీఆర్ఎస్ నాయకులు కలిశారు. కేసీఆర్‌కు భద్రత పెంచాలని గవర్నర్‌ను కోరారు. కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రలపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేశారు. కిరణ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రజలను పరిపాలించే నైతికహక్కు ఆయనకు లేదని పేర్కొన్నారు.