బాబు సీమాంధ్ర యాత్ర సమర్థనీయం: వినోద్ | TRS leader Vinod support chandra babu Atma Gowrava Yatra | Sakshi
Sakshi News home page

బాబు సీమాంధ్ర యాత్ర సమర్థనీయం: వినోద్

Aug 31 2013 8:40 AM | Updated on Jul 28 2018 6:33 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ సమర్థించారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ సమర్థించారు.  శనివారం ఉదయం ఓ ఛానల్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీమాంధ్రలు తమ హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. కొత్త రాష్ట్ర రాజధానితో పాటు, ఇతర వాటి కోసం సీమాంధ్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని వినోద్ అభిప్రాయపడ్డారు.

సీమాంధ్రుల రాజకీయాల వల్లే తెలంగాణ ఏర్పాటు కోరామని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాధ్యత వహించక తప్పదని వినోద్ స్పష్టం చేశారు. మన్మోహన్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నుంచి ఆత్మ గౌరవ యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement