తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత వినోద్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత వినోద్ శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్కు చంద్రబాబు లేఖ రాయడాన్ని కుట్రపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. రాజాధికారం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు.
గతంలో అన్నీ పార్టీలు తెలంగాణా ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు సానుకూలంగానే స్పందించాయని బాబు ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయని చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. అంతేకాకుండా డిసెంబర్ 9 తర్వాత రాష్టంలో పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయన్నారు. అలాగే ప్రత్యేక రాష్టం ఏర్పాటుతో సీమాంధ్రకు జరుగనున్న అన్యాయాన్ని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు వెల్లడించారు.