త్రిసభ్య కమిటీకి వినతులు | trisabhya Committee requests | Sakshi
Sakshi News home page

త్రిసభ్య కమిటీకి వినతులు

Aug 23 2015 3:40 AM | Updated on Sep 3 2017 7:56 AM

ఈనెల 17వ తేదీన నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన నందిని, మనీషారెడ్డిల మృతిపై విచారణ చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని,

కడప ఎడ్యుకేషన్: ఈనెల 17వ తేదీన నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన నందిని, మనీషారెడ్డిల మృతిపై విచారణ చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం రాష్ట్ర అతిథి గృహంలో ఉన్న త్రిసభ్య  కమిటి సభ్యులకు వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. విద్యార్థులు మృతి చెందిన రోజు కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.  త్రిసభ్య    కమిటి సభ్యులను కలిసిన వారిలో వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ జిలా అధ్యక్షుడు అలూరు ఖాజీ ర హ్మతుల్లా, ఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అంకన్న,  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement