చనిపోయిందని వదిలేసి వెళ్లారు! | Tragedy of ten years old girl In Kurnool | Sakshi
Sakshi News home page

చనిపోయిందని వదిలేసి వెళ్లారు!

Jan 11 2020 5:24 AM | Updated on Jan 11 2020 5:24 AM

Tragedy of ten years old girl In Kurnool - Sakshi

మృతి చెందిన లావణ్య

కర్నూలు (హాస్పిటల్‌): అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోతే.. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు కుటుంబసభ్యులు. వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన లావణ్య (10)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తండ్రి భాస్కర్, తాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. పాప కోలుకోకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందింది.

అప్పటికే తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోగా.. చనిపోయే వరకు ఉన్న తాత కూడా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి మెల్లిగా జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పేషెంట్‌ రిజిస్టర్‌లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు బాలిక కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement