పుదుచ్చేరి సమీపంలోని నాగూర్ నాగపట్నం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది.
లోయలో పడిన యాత్రికుల బస్సు
Jul 27 2017 1:27 PM | Updated on Apr 3 2019 7:53 PM
- పలువురికి గాయాలు
పుదుచ్చేరి : పుదుచ్చేరి సమీపంలోని నాగూర్ నాగపట్నం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు.
బాధితులంతా నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుకు చెందినవారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పుదుచ్చేరి అధికారులతో మాట్లాడుతున్నారు.
Advertisement
Advertisement