స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. జెడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వాయిదాపై పార్టీల అభిప్రాయం కోరనుంది.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. జెడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వాయిదాపై పార్టీల అభిప్రాయం కోరనుంది.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలనూ వాయిదా వేయాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం కష్టమని, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.