‘అచ్చతెలుగు అమ్మాయి’లా అందరికీ నచ్చింది | Tollywood Mourns The Death Of Aarti Agarwal | Sakshi
Sakshi News home page

‘అచ్చతెలుగు అమ్మాయి’లా అందరికీ నచ్చింది

Jun 7 2015 1:02 AM | Updated on Sep 3 2017 3:19 AM

మంచి నటిని కోల్పోయూం. సినిమా హీరోయిన్ అంటే కచ్చితంగా శరీరాన్ని నాజూకుగా ఉంచుకోవాలి. లేదంటే

కంబాలచెరువు (రాజమండ్రి) :‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఇంద్ర’, ‘అల్లరి రాముడు’, ‘అందాల రాముడు’, ‘అడవి రాముడు’, ‘నేనున్నాను’ చిత్రాల్లో అలరించిన అందాల ఆర్తి అగర్వాల్ ఇక లేదన్న కబురు జిల్లాలో సినీ అభిమానుల గుండెల్ని బరువెక్కించింది. 31 ఏళ్లకే ఆమె జీవితానికి తెరపడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుజరాత్‌కు చెందిన యువతి అయినా అచ్చం అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించిన ఆమె ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా అందరినీ మెప్పించింది. ఆమెకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఆమె నటించిన పలు చిత్రాల షూటింగ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఎన్‌టీఆర్‌తో నటించిన ‘అల్లరి రాముడు’ తాటిపాకలో చిత్రీకరణ జరుపుకొంది.
 
  సునీల్ హీరోగా నటించిన ‘అందాల రాముడు’ చిత్రం షూటింగ్ కోనసీమలో జరిగింది. ‘గోరింటాకు, నువ్వులేక నేనులేను’  చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకొన్నారుు. ఆ సమయంలో ఆర్తి మన ప్రాంత వంటకాలు, పూతరేకులు, తాపేశ్వరం కాజాలను అడిగి మరీ తెప్పించుకుని, ఇష్టంగా తిన్నారని సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న నగరానికి చెందిన వారు చెప్పారు. మన ప్రాంతానికి చెందిన అమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండి, అందరితో కలిసిపోయేదన్నారు. కాగా ఆమె మరణం సినీపరిశ్రమకు తీరని లోటని పలువురు సినీప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె కొంత మానసిక ఒత్తిడితో బాధపడిందని,  అది సినీపరిశ్రమలో సర్వ సాధారణమయినా దాన్ని జయించలేకపోయిందని అన్నారు. దివ్యభారతి చనిపోయినప్పుడు గుండె కలుక్కుమందని, ఇప్పుడూ అంతే బాధ కలిగిందని అన్నారు.
 
 చాలా బాధపడుతున్నా..
 పదహారణాల తెలుగు పడుచులా కనిపించే ఆర్తి అగర్వాల్ మంచి నటి. ఆమె అకాల మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆమెతో నేను ‘సోగ్గాడు, గోరింటాకు’తో పాటు మరో ఐదు సినిమాల్లో నటించాను. కొద్దినెలల క్రితం ఒక ఫంక్షన్‌లో కలిసినప్పుడు బొద్దుగా కనిపించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది.
 - గౌతంరాజు, సినీనటుడు
 
 ముందుగానే మేల్కొని ఉండాల్సింది
 మంచి నటిని కోల్పోయూం. సినిమా హీరోయిన్ అంటే కచ్చితంగా శరీరాన్ని నాజూకుగా ఉంచుకోవాలి. లేదంటే వచ్చిన ఆఫర్లు తిరిగి వెళ్లిపోతాయి. సరైన ఫిట్‌నెస్ లేక ఆర్తి అవకాశాలు కోల్పోయింది. ఆమె నటించిన సమయంలో రేసులో ఉన్న హీరోరుున్లను అధిగమించిందే కానీ సరైన విధానంలో వెళ్లలేకపోయింది.
 - గాయత్రి, హీరోయిన్ (ఒక రొమాంటిక్ క్రైం స్టోరీ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement