టాలీవుడ్ సినిమా చానల్ ఆవిష్కరణ | Tollywood cinema channel launched | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ సినిమా చానల్ ఆవిష్కరణ

Aug 24 2013 2:12 AM | Updated on Aug 28 2018 4:30 PM

టాలీవుడ్ సినిమా చానల్ ఆవిష్కరణ - Sakshi

టాలీవుడ్ సినిమా చానల్ ఆవిష్కరణ

వినోదంతో పాటు తెలుగు సినీరంగంలో తెరవెనుక ఉన్న సమస్యలను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు టాలీవుడ్ సినిమా చానల్ కృషి చేయనుందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: వినోదంతో పాటు తెలుగు సినీరంగంలో తెరవెనుక ఉన్న సమస్యలను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు టాలీవుడ్ సినిమా చానల్ కృషి చేయనుందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అగ్రిగోల్డ్‌కు చెందిన టాలీవుడ్ చానల్ లోగోను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు. టాలీవుడ్ చానల్ యాంటీ పైరసీ ఫోర్స్ కాంపెయిన్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, హీరోలు శ్రీకాంత్, అల్లరి నరేష్‌లు ప్రారంభించారు.
 
  సినిమా న్యూస్ బులెటిన్లను కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, అగ్రిగోల్డ్ చైర్మన్ వీఆర్ రావు అవాస్, టాలీవుడ్ సినిమా చానల్ చైర్మన్ సీతారామారావు, నటీ నటులు సమంత, కాజల్, తమన్నా, మనోజ్, తరుణ్, నిఖిల్, అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement